Popular posts from this blog
Raj weds Pavani marriage album
ఒక్కో అడుగుతో ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇస్తున్నట్లు లెక్క. మొదటి అడుగు .. అన్నవృద్ధికి. అంటే అన్నపూర్ణగా పిలిచే మనదేశంలో పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది. రెండో అడుగు .. బల వృద్ధికి.. వధువరుల ఇరు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలతో ఉండాలని వేస్తారు. మూడో అడుగు .. ధన ప్రాప్తి కలగాలని వేస్తారు. నాలుగో అడుగు .. దంపతులిద్దరూ సదా సుఖ సంతోషాలతో ఉండాలని వేస్తారు. ఐదో అడుగు .. ఒక్క తమ కుటుంబం మాత్రమే కాకుండా సమాజానికి తమ చేతనైన మేరకు సాయం చేస్తామని చెబుతూ ఐదో అడుగు వేస్తారు. ఆరో అడుగు .. వైవాహిక జీవితంలో ఎలాంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని వేస్తారు. ఏడో అడుగు .. శారీరకంగా, మేధో పరంగా పుష్ఠి కలిగిన సంతానాన్ని కలిగించాలని వేసే అడుగు.
Comments
Post a Comment